రుద్రూర్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్ లైన్ లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీఎస్ఆర్ 817, అలాగే కార్పొరేట్ వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులు, మార్కెట్లోకి వస్తున్న వాటిపై కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినప్పటకి స్పందించక పోవడంతో ఈ నెల 20న మందుల దుకాణాలు బంద్ పాటిస్తున్నట్టు నిజామాబాద్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నల్ల మదుసుధన్, జిల్లా ప్రధాన కార్యదరి బీర్కుర్ సుధాకర్ వెల్లడించారు. ఈ సందర్బంగా రుద్రూర్ గ్రామ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తహసిల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్నకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ జాతీయ సంస్థ అయిన ఏఐవోసీడి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒకరోజు బంద్ పాటిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర సంస్థ అయిన టీటీడీసీఏ నిర్వహించిందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, సంతోష్, శంకర్, సుధీర్, అడప శంకర్ తదితరులు పాల్గొన్నారు.