Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2024, 3:51 pm Posted by : ramakrishna

ఆధునిక హంగులతో వైద్య సేవలు

  • నూతన మేనేజ్మెంట్ తో ఘనంగా ప్రారంభమైన శ్రీ సిగ్మా హాస్పిటల్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని ఖలీలావాడి లో డాక్టర్ ప్రముఖ వైద్యులు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్పత్రిని ప్రారంభించడం జరిగింది. ఈ ఆస్పత్రిలో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్, జనరల్ సర్జన్, యూరాలజిస్ట్, జనరల్ మెడిసిన్ తో పాటు 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి చైర్మన్ గడిల శ్రీ రాములు తెలిపారు. అంతేకాకుండా ఈ శ్రీ సిగ్మా ఆస్పత్రిలో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. వైద్య నిపుణులతో పాటు స్కానింగ్ సెంటర్, సిటీ స్కాన్, ఎక్స్రే తోపాటు నూతన టెక్నాలజీతో కూడుకున్న రక్త పరీక్షల సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన సూచించారు. డైరెక్టర్స్, ఆర్గనైజర్స్, గాదరి గోపి, ప్రముఖ వ్యాపారవేత జయసింహ గౌడ్,, ధనలక్ష్మి,వెంకటేష్,ప్రముఖ న్యూస్ ఛానల్ డైరెక్టర్ గాదె కృష్ణ,రవీందర్,సతీష్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.