బాన్సువాడ, బతుకమ్మ: స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందికి వైద్యులు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మాట్లాడుతూ.. కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యులు కీర్తి, సమీ, నాయకులు ఎజాస్, అలిముద్దీన్ బాబా, కౌన్సిలర్లు రమాదేవి, రాజాగౌడ్, బాడీ శీనివాస్, వెంకటేశ్, కిరణ్, హకీం, నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.