15 మంది నకిలీ ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు
వెబ్ న్యూస్,బతుకమ్మ : తెలంగాణలో తాజాగా 15 మంది నకిలీ ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని టీజీఎంసీ వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో జీడిమెట్ల, మియాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34,54, టీఎస్ ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారని తెలిపారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు పరిధి...