బతుకమ్మ, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కోనేరు చారిటబుల్ ట్రస్టులో మెగా హెల్త్ క్యాంపును ట్రస్ట్ నిర్వాహకులు ఎన్నారై కోనేరు శశాంక్ ప్రారంభించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడమే కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం అని ఎన్నారై కోనేరు శశాంక్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు చేసి సేవలు అందించారు. మహిళలు, వృద్ధులకు మొత్తం 200 మంది పేషెంట్లకు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ మాట్లాడుతూ… ఈ హెల్త్ క్యాంప్ లాగానే బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ అన్నారు. నియోజకవర్గంలో చాలామంది పేదలు మెరుగైన వైద్య సేవలకు దూరంగా ఉన్నారని స్థానికంగా ఉండే ప్రధమ చికిత్సలయాల్లోనే చికిత్సలు తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ స్థాయి వైద్యులతో వారికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరానికి సహకరించిన మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్, వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా ఉండి వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన బిజెపి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఏముల నవీన్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరి, పోతంగల్ మండలం మాజీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్, సున్నం సాయిలు,స్థానిక నాయకులు పుల్లెల మోహన్ రావు, శ్యామల కులకర్ని , నాగేల్లి శ్రీనివాస్, వడ్ల శ్యామ్, వల్లభాపూర్ గంగాధర్,రాంపూర్ సాయిలు,లింగాపూర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.