Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 5:25 pm Posted by : ramakrishna

ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ధర్పల్లి, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్, వరంగల్ ఆర్ డి డి ఆదేశాల మేరకు మంగళవారం ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం లో భాగంగా హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందంచే ఉచిత హోమియో వైద్య శిబిరం, ఉచిత ఆరోగ్య యోగ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమం, గర్భిణీ స్త్రీలకు అవగాహన, అంగన్ వాడి కేంద్రం లో పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్, స్కూల్ విద్యార్థి విద్యార్థులకు యోగ ఆసనాలు వేయించి యోగ వలన జరిగే లాభాలు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లు క్యాంపు ఇన్చార్జి డాక్టర్ మమత తెలిపారు. ఈ వైద్య శిబిరం లో సుమారు 250 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితం గా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ జె. వినోద్ కుమార్, డాక్టర్ మీరాబాయి, డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ నాగ సురేఖ, జూనియర్ వైద్యులు, ఆయుష్ డి పి ఎం వందన రెడ్డి, హోమియో వైద్యులు డా. భువన, డా. శ్రీలేఖ, ఆయుష్ ఫార్మ సిస్ట్స్ లు పురు షో తం, ఉమా ప్రసాద్, మురళీ, బాబూరావు, రమణ, పారా మెడికల్ సిబ్బంది విఠల్, సుజాత, యోగ శిక్షకులు,  ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎంపీఓ, వి డి సి సభ్యులు కుంట రాజన్న, సాయి గోపాల్, పంచాయతీ కార్యదర్శి చెలిమెల రాజ్ కుమార్ , మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు.

Medical camp under the auspices of AYUSH department