Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 6:43 pm Posted by : ramakrishna

ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నందిపేట్, బతుకమ్మ :  తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీకాంత్ బాబు , రాష్ట్ర  ఆయుష్ గ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ లింగరాజు, వరంగల్ ఆర్ డి డి డాక్టర్  ప్రమీల దేవి ఆదేశాల మేరకు శుక్రవారం నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం లో భాగంగా హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం, ఉచిత ఆరోగ్య యోగ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమం, గర్భిణీ స్త్రీలకు అవగాహన, అంగన్ వాడి కేంద్రం లో పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్, స్కూల్ విద్యార్థి విద్యార్థులకు యోగ ఆసనాలు వేయించి యోగ వలన జరిగే లాభాలు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లు క్యాంపు ఇన్చార్జి డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ వైద్య శిబిరం లో సుమారు 219 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితం గా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ డాక్టర్ జార్జ్ ,వైద్యులు శ్రీకాంత్, అనిల్, ప్రితం సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీవాణి, డాక్టర్  నీలిమ, పీజీ ,సీనియర్,జూనియర్ వైద్యులు, ఆయుష్ ఫార్మ సిస్ట్స్ లు ఉమా ప్రసాద్,  వీంద్యారని  పారా మెడికల్ సిబ్బంది  పోశెట్టి, భిక్షపతి యోగ శిక్షకులు, పాల్గొన్నారు.

Medical camp under the auspices of AYUSH department