బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శుక్రవారం ఐ సి టి సి అధికారుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో గల పైలేరియా కేసులను సందర్శించి అనంతరం పాత గ్రామపంచాయతీ భవనంలో 150 మంది హెచ్ఐవి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, అధికారి శివా, వైద్య సిబ్బంది దీప సద్గుణ, సరిత, ఆశ వర్కర్లు శ్యామల, లత, సరిత తదితరులు పాల్గొన్నారు.