Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 5:53 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాదులపై మెడికల్ క్యాంప్

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని హన్సన్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ ప్రజలకు మలేరియా నిర్దారణ చేసారు. దాదాపు 30 మందికి నిర్దారణ పరీక్షలు చేయగా ఎవరికి పాజిటివ్ రాలేదని .అలాగే డెంగ్యూ వ్యాధి గూర్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య బృందం గ్రామస్తులకు సూచించారు.ఇంటిలోపల కానీ బయట ఆవరణలలో నీళ్ళను నిల్వ ఉంచుకోవడం సరికాదన్నారు.నీళ్ళు నిల్వ ఇండడం ద్వారానే దోమలు తయారయ్యి మనకు దోమ కాటువేయడం ద్వారా  మలేరియా లేదా డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వై.శంకర్ ఆరోగ్య విస్తీరణ అధికారి, అక్బర్ అలీ ఆరోగ్య పర్యవేక్షకులు, సి.రాజేందర్ మలేరియా సబ్ ఎడిటర్ అధికారి. ఏ.లేయా MLHP ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి, ఏఎన్ఎం మమత,గ్రామ పంచాయితీ కార్యదర్శి అశ్వంత్, ఆశావర్కర్లు జులేఖ, భాగ్య పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.