. . . పాల్గొన్న నగర మేయర్ ఉమారాణి రమేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని వర్ధన్ హాస్పిటల్ లో డాక్టర్ సెల్ హెల్త్ అండ్ వెల్త్ చైర్మన్ డా.సృజిల్ బాబు తెడ్డు ఆధ్వర్యంలో ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ ఉమారాణి రమేష్ కేక్ కట్ చేసి మెడికల్ క్యాంపును పరిశీలించి, మెడికల్ టెస్ట్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు మంచి నిర్ణయమని ప్రజలకు ఉపయోగపడే విధంగా క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.బిందుజ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ధర్మారం అవిన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినయ్, టీఎంఆర్ పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, వర్ధన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తెడ్డు బాబు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
