మానవాళికి మధ్యవర్థితం మేలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల బతుకమ్మ, నిజామాబాద్ : మానవ సమాజంలో మనుషుల మధ్య ఉన్న అన్ని సమస్యలకు మధ్యవర్థిత్వమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి జిల్లాకోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవ సధన్ లో మధ్యవర్థిత్వ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సామాజిక వర్గాలుగా కొన్ని మధ్యవర్థిత్వ కేంద్రాలు ఉన్నాయని...