Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 2:42 pm Posted by : ramakrishna

ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర

వెబ్ డెస్క్, బతుకమ్మ :   ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని  వన దేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.జంపన్న వాగులో స్నానాలు ఆచరించి భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. మండమెలిగె పండుగతో జాతర ప్రారంభిస్తారు. పున్న మి వెలుగుల్లో పూజారులు జాగారం చేస్తారు. గురువారం మండమెలిగె పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం జాతర నిర్వహిస్తారు. జాతర నిర్వహణకు  రాష్ట్ర ప్రభుత్వం రూ.5.30 కోట్లను కేటాయించింది.