వరంగల్, బతుకమ్మ: మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ జిల్లాలో ఆయన పర్యటించారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇందుకోసం ఆయన వందేభారత్ రైలులో హైదరాబాద్ నుంచి వరంగల్ కు వచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ క్యాంటీన్ లో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని భద్రకాళి అమ్మవారిని, వేయిస్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.