Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 5:15 pm Posted by : ramakrishna

భూ కబ్జా లపై కలెక్టర్ ఆదేశంతో కదిలిన యంత్రాంగం

  • బఫర్ జోన్ లో గజ్యానాయక్ నాయక్ తండా గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక
  • సర్వే చేసి తేల్చిన అధికారులు
  • బతుకమ్మ ఎఫెక్ట్

 

బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా వీక్లీ మార్కెట్ లో సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా భూ కబ్జా వార్ నడుస్తోంది. ఈ విషయాన్ని బతుకమ్మ దిన పత్రిక కథనం ప్రచురించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం తో రెవిన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. మాచారెడ్డి ఊర చెరువు శిఖం లోనే గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక నిర్మాణాలు జరిగినట్లు తేల్చారు.  వాటి ముందు గల మరి కొన్ని ఆక్రమణలు బఫర్ జోన్ లో ఉన్నట్టు తేలింది. తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని అధికారులకు చెప్పడంతో వాటిని ఆఫీస్ కు తెమ్మని చెప్పారు.‌

  • కబ్జాదారుల్లో వణుకు..

మాచారెడ్డి మండల కేంద్రంగా వ్యవహరించబడుతున్న గజ్యానాయక్ తండా (మాచారెడ్డి చౌరస్తా) లో శిఖం భూములే కాకుండా రెవిన్యూ భూములు, ప్లాట్లను స్థానిక నాయకులు కొందరు కబ్జా చేసిన ఆరోపణలున్నాయి. ఇంటి నెంబరు వేసి ప్లాట్ల క్రయ విక్రయాలు జరిగాయి. ఇందుకు బాధ్యులైన అధికారుల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికైనా బాధిలకు సరైన న్యాయం జరుగుతుందేమో చూడాలి.

Mechanism set in motion by the order of the Collector on land acquisitions