Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 10:49 pm Posted by : ramakrishna

కదలనున్న యంత్రాంగం

  • గ్రామాల్లోని బీయల్ఓలపై పెరిగిన అధికార పార్టీ నాయకుల ఒత్తిడి
  • బతుకమ్మ కథనానికి స్పందన

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ల ఓటర్ నమోదు ప్రక్రియ మందగించడం పై నేడు బతుకమ్మ లో ప్రచురితమైన వార్తతో బిఎల్వోలు ఒక్కొక్కరుగా మెల్లగా కదలడం ప్రారంభించిన్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, గ్రాడ్యుయేట్ల తో కలిసి పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి ఈ అంశంపై స్థానిక పంచాయతీ కార్యదర్శులను మరియు బిఎల్ఓ లను ప్రశ్నించడం పలు గ్రామాల్లో కనిపించింది. ఔత్సాహిక ఎమ్మెల్సీ అభ్యర్థులు సైతం పట్టణాలను వీడి గ్రామాల్లోకి వెళ్లి ఓటర్ నమోదుకు క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉన్న బిఎల్ఓ లకు మెసేజ్లు పెట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు పై విస్తృత ప్రచారం చేపట్టాలని మెల్లిమెల్లిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్సీ ఓటు నమోదు విషయంలో స్థానిక తహసీల్దార్ ఆఫీస్ కు సర్టిఫికెట్ వెరిఫీకేషన్ కోసం గ్రాడ్యుయేట్ లు వెళ్లి చేయించుకోవాలన్న అంశం గ్రాడ్యుయేట్ లకు ఇబ్బందిగా మారిన విషయం విధితమే . ఈ ఓటు నమోదు విషయంలో గ్రాడ్యుయేట్ లకు కలుగుతున్న ఇబ్బందికారణంగా రానున్న అన్ని ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, విభిన్నంగా గ్రాడ్యుయేట్ ల నిర్ణయాలు ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోని తమ తమ పార్టీలకు నష్టం వాటిల్లకుండా
అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల్లోసైతం బతుకమ్మ వార్త తర్వాత కదలిక ప్రారంభమైంది. బిఎల్ఓ లను పిలిపించి గ్రాడ్యుయేట్ ల ఓటర్ నమోదు చేపట్టాలని కోరుతున్నారు. అక్కడక్కడ అసహనానికి గురైన గ్రాడ్యుయేట్లు ఆన్లైన్ నమోదు చేసుకున్న తర్వాత కూడా గెజిటెడ్ సంతకాలు,బిఎల్ఓ సంతకాల పేరుతో తమను రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పడంపై నిలదీతలు సైతం జరుగుతున్నాయి.కొన్ని గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు పార్టీ ప్రతిష్టతను కాపాడేందుకు స్థానికస్పెషల్ ఆఫీసర్లు,బీఎల్ ఓ లు, కారోబార్ల తో నేటి నుండి 5 తేదీ వరకు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్ ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్థానికంగా జరిగే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది.

ఇంత జరుగుతున్న చాలా చోట్ల ఇప్పటికి పలువురు బిఎల్ఓ లలో కదలిక రాలేదు. అధికారికంగా ఆర్డర్ వస్తేనే అంతటా సద్దుమనగనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 10 నుంచి 20% బిఎల్వోలు మాత్రమే కదిలినట్టుగా తెలుస్తోంది. బతుకమ్మలో శనివారం ప్రచురితం అయిన ఓటు మాకొద్దు వార్తకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్. బండారి రాజ్ కుమార్ స్పందించారు. అయన బతుకమ్మ తో ఫోన్ లో మాట్లాడుతూ ఈ విషయమై ఉన్నత రాష్ట్ర స్థాయిలో అధికారులకు వినతి గతంలో ఇచ్చిన ఫలితం లేదన్నారు . ఇప్పటికైనా స్పందించాలని భీమ్ గల్ తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు.
ఈ సున్నితమైన విషయం చిలికి పెద్దగా కాకా ముందే తక్షణమే జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు ఈ అంశంపై చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ మిగిలి ఉన్న మూడు రోజులలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగే అవకాశం లేనట్లే, ఇకనైనా రెవెన్యూ అధికారులు బిఎల్ఓ లు పూర్తిస్థాయిలో స్పందిస్తారా లేదా వేచి చూడాలి మరి.