ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో మార్కెట్ యార్డ్, వ్యాపార సాముదాయాల వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యల కోసం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం రాత్రి కాలినడకన పర్యవేక్షించారు. ముందుగా ఈ వ్యాపార సముదాయాలు మరియు మార్కెట్ పరిసర ప్రాంతాలలో గల వ్యాపార సాముదాయాలతో, ప్రజలతో సుదీర్ఘంగా వారికి గల కష్టాలను, వారికి అవసరమైన సౌకర్యాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని మార్కెట్ యార్డ్ , కిషన్గంజ్, శ్రద్ధానంద్ గంజ్,...