- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో మార్కెట్ యార్డ్, వ్యాపార సాముదాయాల వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యల కోసం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం రాత్రి కాలినడకన పర్యవేక్షించారు. ముందుగా ఈ వ్యాపార సముదాయాలు మరియు మార్కెట్ పరిసర ప్రాంతాలలో గల వ్యాపార సాముదాయాలతో, ప్రజలతో సుదీర్ఘంగా వారికి గల కష్టాలను, వారికి అవసరమైన సౌకర్యాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని మార్కెట్ యార్డ్ , కిషన్గంజ్, శ్రద్ధానంద్ గంజ్, దేవి రోడ్డు, పూసల గల్లి, ఓల్డ్ గంజి మరియు వ్యాపార సాముదాయాల ప్రాంతాలలో ప్రజలు, వ్యాపారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా పరిరక్షణ సామాజిక శాంతి భద్రత కోసం పోలీస్ కమిషనర్ గారి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇందుకుగాను అవసరానికి అనుకూలంగా ప్రత్యేక బృందాలు నియమించడం, ఇందుకోసం ప్రజలు, వ్యాపారులు సమన్వయంతో సహకరించాలని , ఎలాంటి అనుమానాస్పద చట్ట విరుద్ధ కార్యకలాపాలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలియజేశారు. మీ సహకారమే సురక్షిత నిజామాబాద్‌కు మూలస్తంభం అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పైన వన్ టౌన్ యస్ హెచ్ ఓ రఘుపతి మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్, సంబదిత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
