కల్తీ కల్లుపై ఉక్కుపాదం

బోధన్, బతుకమ్మ: కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపుతామని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఏసీపీ సుబ్బరామిరెడ్డి అన్నారు. కల్తీకల్లుకు వ్యతిరేకంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. కల్తీ కల్లుపై ప్రజలను చైతన్యవంతులను చేసి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కల్తీకల్లు వ్యాపారులు అక్రమసంపద కోసం అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కల్తీకల్లు, గంజాయి వంటి వాటికి...