Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 9:14 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

  • సైబర్, గేమ్ అప్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి
  • భీమ్ గల్ ఠాణా పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య

 

భీమ్ గల్, బతుకమ్మ : రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాధాల నివారణకు కావాల్సిన చర్యలను చేపట్టాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గురువారం భీమ్ గల్ పోలీస్ ఠాణాను సీపీ పర్యవేక్షించారు.ఈ సందర్బంగా సీ. పీ మాట్లాడుతూ ప్రధానంగా రోడ్డు ప్రమాధాలు ఎక్కువగా ద్విచక్ర వాహన దారులకు జరుగుతున్నందున, ద్విచక్రవాహన దారులు తప్పనిసరి హెల్మెట్ ధరించే విధంగా చూడాలని అన్నారు. ముఖ్యంగా యువత గంజాయి కి బానిసలూ అవుతున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. గంజాయి నిర్ములనకు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు ప్రజలు బలికుండా ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పర్యవేక్షణ లో భాగంగా పోలీస్ స్టేషన్ ను కలియ తిరిగారు. రిసెప్షన్, కంప్యూటర్ విభాగం లో పని తీరును సీపీ అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి, 5 ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ సిబ్బంది సమస్యలను గురించి సిబ్బందిని సీ. పీ అడిగి తెలుసుకున్నారు. సీ. పీ పర్యవేక్షణ సందర్బంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీ. ఐ శ్రీధర్ రెడ్డి, భీమ్ గల్ సీ. ఐ సత్యనారాయణ, భీమ్ గల్ ఎస్సై మహేష్, కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ కుమార్, ఎర్గట్ల ఎస్సై రాము,మోర్తాడ్ ఎస్సై విక్రమ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Measures should be taken to prevent road accidents.