Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 8:04 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
  • జాతీయ రహదారి 44ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

 

ఆర్మూర్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలలో భాగమైన ఎన్ హెచ్ 44 లో గల పెర్కిట్ బైపాస్ జంక్షన్, కరీంనగర్ అండర్ పాస్ రోడ్డును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను ఎలా తగ్గించాలో తగు జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, హైవే సిబ్బందికి సూచించారు.

Measures should be taken to prevent road accidents.

అదేవిధంగా వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలని తెలిపారు. వాహనాదరులు తప్పనిసరిగా ఆర్టీఓ సూచనలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ,  ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి ,  ఆర్మూర్ ఎస్ఎచ్ఓ సత్యనారాయణ , ఇతర పోలీసు సిబ్బందితో పాటు ఐరాడ్ ప్రాజెక్టు మేనేజర్ వర్షా,  నేషనల్ హైవే సిబ్బంది రామారావు, విరాజ్ పాల్గొన్నారు.

Measures should be taken to prevent road accidents.