Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 5:38 pm Posted by : ramakrishna

మాస్ కాపింగ్ కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి

 

. . . ఎస్.ఎస్.సి పరీక్ష కేంద్రాలలో తనిఖీలు నిర్వహించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపింగ్ కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. బుధవారం ఎస్.ఎస్.సి పబ్లిక్ ఎగ్జామ్ లో భాగంగా రెండవ పేపర్ అయినా హిందీ, తెలుగు నిర్వహించారు. నగరంలో గల ఎస్ ఎఫ్ ఎస్ హైస్కూల్, రవి స్కూల్ పరీక్ష కేంద్రాలలో సీపీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల చుట్టూ ముట్టు ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరిచి ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Measures should be taken to avoid mass copying.

 

ఈ సందర్భంగా టౌన్ 3 పి.ఎస్ ఎస్.ఐ జి.నారాయణ, హెడ్ మాస్టర్ ఆనంద్, సిట్టింగ్ స్క్వాడ్ ఇన్ చార్జ్ మహమ్మద్ అలీ, మల్లికార్జున్ సిఎస్, నవీన్ డిపార్ట్ మెంటల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

 

Measures should be taken to avoid mass copying.