Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:46 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

 

లింగంపేట, బతుకమ్మ :

 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి సభ్యులు యూనిట్ అధికారి గోవింద్ రెడ్డి సూచించారు. బుధవారం లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లింగంపల్లి భవానీపేట్ గ్రామాల్లోని సబ్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెన్సీ ఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ టు నైట్ కార్యక్రమంలో భాగంగా ఆయన సబ్ సెంటర్లను తనిఖీ చేశారు. సబ్ సెంటర్లలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హిమబిందు మాట్లాడుతూ పిల్లలను గుర్తించి వారికి కచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని సూచించారు. డయేరియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వరుసగా 14 రోజుల పాటు జింక్ మాత్రలు అందించాలని ఆశా కార్యకర్తలకు ఆదేశించారు. వర్షం కురిసిన సమయంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశము ఉన్నందున వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు తాగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ సిహెచ్ఓ ఠాగూర్, వైద్య సిబ్బంది భాగ్య సునీత తో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.