మెనూ ప్రకారం భోజనం అందించాలి
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పి సెట్టి బతుకమ్మ, జుక్కల్ : మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు భోజనం అందించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పి సెట్టి అన్నారు. ఎస్సీ బాలికల హాస్టల్ ను శనివారం ఆమె సందర్శించారు. వర్షాకాలంలో హాస్టల్ స్లాబ్ కురుస్తుందని విద్యార్థులు ఆమెకు తెలిపారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం ఎస్సీ బాలుర హాస్టల్ ను ఆమె సందర్శించి మెనూ ప్రకారం విద్యాబోధన చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులను పరిశీలించారు. 30...