Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2024, 4:46 pm Posted by : ramakrishna

మెనూ ప్రకారం భోజనం అందించాలి

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పి సెట్టి

బతుకమ్మ, జుక్కల్ : మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు భోజనం అందించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పి సెట్టి అన్నారు. ఎస్సీ బాలికల హాస్టల్ ను శనివారం ఆమె సందర్శించారు.  వర్షాకాలంలో హాస్టల్ స్లాబ్ కురుస్తుందని విద్యార్థులు ఆమెకు తెలిపారు. వెంటనే మరమ్మతులు  చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం ఎస్సీ బాలుర హాస్టల్ ను ఆమె సందర్శించి మెనూ ప్రకారం విద్యాబోధన చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులను పరిశీలించారు. 30 పడకల ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. సరైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. అనంతరం హై స్కూల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని అన్నారు.  కౌలాస్ నాలా ప్రాజెక్టును దర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హిమబిందువు, ఎంపీడీవో శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ విట్టల్ పటేల్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు పటేల్, ఎంపీఓ రాము, జుక్క గ్రామపంచాయతీ కార్యదర్శి బలరాం, అధికారులు, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Meals should be served as per the menu