Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 9:00 pm Posted by : ramakrishna

మెనూ ప్రకారం భోజనం అందించాలి

  • మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : గవర్నమెంట్ హాస్టలళ్లలో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంను అందించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు.మంగళవారం ఆయన పట్టణంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ లోకి వెళ్లి వంటకు కొస్తున్న కూరగాయాలను, మినరల్ వాటర్ ఫిల్టర్ మిషన్ లను పరిశీలించారు. అందులో వాటర్ ఫిల్టర్ రిపేర్ ఉండడం గమనించి వెంటనే రిపేర్ చేయించాలని వార్డెన్ కు సూచించారు. టాయిలెట్ లను పరిశీలించి, ఎప్పటికప్పుడు టాయిలెట్ లు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెల్సుకొని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Meals should be served according to the menu.