Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 8:18 pm Posted by : ramakrishna

ఏర్గట్ల మండల టాపర్ గా ఎండి రీంషా

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తడపాకల్ గ్రామానికి చెందిన ఎండి రీంషా, 558 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సాధించారు. అలాగే ఏర్గట్ల గ్రామానికి చెందిన జె వైష్ణవి 541 మార్కులు సాధించి మండల ద్వితీయ స్థానం సాధించారని మండల విద్యాశాఖ అధికారి బి ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పదవ తరగతి పరీక్ష వ్రాసిన 158 మంది విద్యార్థులలో 156 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఏర్గట్ల మండల కస్తూర్బా గాంధీ స్కూల్ విద్యార్థులు 31 మంది పరీక్ష వ్రాయగా 31 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల కస్తూర్బా గాంధీ ఎస్ఓ సంధ్య సంతోషం వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ విద్యార్థి బి.ప్రణతి కి 537, ఎన్.మనోజ్ఞ కు 532, వి.వైష్ణవి కి 529 మార్కులు వచ్చినట్లు ఎస్ఓ తెలిపారు. ఏర్గట్ల మండల ఉత్తీర్ణత స్థానం 98.7% అని బి.ఆనంద్ రావు తెలిపారు.

 

MD Reemsha is the topper of Ergatla Mandal.