పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మేయర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముబారక్‌నగర్ పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం మేయర్ ఉమారాణి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజల శ్రేయస్సు, నగర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం హనుమాన్ భిక్ష కార్యక్రమంలో భాగస్వామ్యమై భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో భక్తి పూర్వకంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడింది.