Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 5:31 pm Posted by : ramakrishna

జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలి

మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్ అసోసియేషన్   ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ (13 మండలాలు) కి నిర్వహించిన ఎన్నికల్లో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్- వైస్ ప్రెసిడెంట్ గా మోర్తాడ్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఎన్నిక కావడం సంతోషకరమైన విషయమని (డీ ఆర్ డి ఏ) ఐకెపి సీసీల జిల్లా కార్యదర్శి తడకల శ్రీనివాస్ అన్నారు. జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.  ఈ సందర్భంగా ఆయనను శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యాలయంలో మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో సిసి మహేందర్, కరుణ ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.