Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 8:15 pm Posted by : ramakrishna

ప్రతి ఇంట్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలి

 

. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

అల్లా కృపతో ప్రతి ఇంట్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి వారికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

May there be peace and prosperity in every home.