Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 6:18 pm Posted by : ramakrishna

ఇందూరు ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

శ్రీదేవి అమ్మవారి మహిమలు ఎంతో విశిష్టమైనవని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శ్రీదేవి అమ్మవారి కి నిష్ఠతో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేసినవారికి ఎంతో పుణ్యఫలం దక్కుతుందని ఆయనన్నారు. ఈ నెల 3 నుండి 12వ తేదీ వరకు బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ అమ్మవారి ప్రవచనాలు భక్తులకు తెలియపరచడం అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కటాక్షాలు కలుగుతాయో భక్తులకు తెలియ చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఇందూరు పట్టణంలో జరగడం ఇందూరు ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని వేద పండితులు అన్నట్లుగానే ఆ అమ్మవారి దయ వల్ల ఇందూరు ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఆనందోత్సవాలతో ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి వైభవో పేతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇందూరు నగరంలో మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఆగమయ్య గజవాడ, పార్శిరాజు, యంసాని రవీందర్, లాబిశెట్టి శ్రీనివాస్, సమస్త ఇందూరు భక్త బృందం పాల్గొని విజయవంతం చేశారు.

 

May the people of Indore be blessed with good health and prosperity.
May the people of Indore be blessed with good health and prosperity.