Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 4:12 pm Posted by : ramakrishna

పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

  • ఎమ్మెల్యే మదన్ మోహన్

 

లింగంపేట, బతుకమ్మ : పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆకాంక్షించారు. లింగంపేట మండలం సజ్జన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ  “పెద్దమ్మ తల్లి ఆశీసులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా రైతులు సుఖసంతోషాలతో ఉండాలి” అని కోరుకున్నారు. పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం, అభివృద్ధి కోసం తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లి దీవెనలతో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీసులతో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. అనంతరం భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

May the people be happy and content with the blessings of the great mother.