కార్మికులందరికీ మేడే రోజు సెలవు ఇవ్వాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్ని రంగాల కార్మికులకు మేడే రోజు సెలవు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అసిస్టెంట్ కమీషనర్ శ్రావణి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులందరికీ మేడే పండగ రోజన్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మేడే సెలవు రోజుగా పరిగణించబడుతుందన్నారు. కానీ  మేడే సెలవు రోజును పెయిడ్ హాలిడేగా కేంద్ర...