ఘనంగా మేడే వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్క గ్రామాలల్లో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు కార్మిక జెండా ఆవిష్కరించి మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయగీతిక శ్రమ జీవుల సంఘటిత ప్రతీక మేడే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శంకర్, నాగయ్య, శంకర్, కృష్ణ, గంగారాం, ఎర్ర సాయవ్వ, నీలా, అశోక్ తదితరులు ఉన్నారు.