. . . ఐఎఫ్ టియు నగర కార్యదర్శి ఎం.శివ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మే 1 న మే డే సభను నగరంలోని కోటగల్లిలో గల ఎన్ ఆర్ భవన్ లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని, కార్మికులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఐఎఫ్ టియు నగర కార్యదర్శి ఎం.శివకుమార్ అన్నారు. మేఘన డెంటల్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు బాలకృష్ణ ఐఎఫ్ టియు పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం కార్యదర్శి మాట్లాడుతూ 8 గంటల పని దినం మేడే వీరుల త్యాగఫలమేనని తెలిపారు. 1886లో 8 గంటల పని దినం కోసం, ఇతర కార్మిక హక్కుల కోసం అమెరికాలోని చికాగో కార్మికులు పోరాడారన్నారు. వారి పైన అమానుషంగా అక్రమంగా కాల్పులు జరిపి వందలాదిమందిని పోలీసు బలగాలు పొట్టన పెట్టుకున్నాయని, వీరి త్యాగాలను మననం చేసుకొని, వారిచ్చిన స్ఫూర్తిని కొనసాగించడానికి మే డే ను ప్రతి సంవత్సరం మే 1న జరపాలని అంతర్జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేఘన డెంటల్ కాలేజ్ వర్కర్స్ నాయకులు, శ్యామ్, ప్రసాద్, శేఖర్, సాయిలు, మహేష్, ప్రశాంత్, దాసు, తదితరులు పాల్గొన్నారు.