Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 2:11 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ భవన్ లో ఘనంగా మౌలాన జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

కాంగ్రెస్ భవన్ లో మాజీ కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ 137 జయంతిని  మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పిసిసి జనరల్ సెక్రటరీ రాంభూపాల్  మాట్లాడుతూ మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ సేవలను కొనియాడారు. పేద ప్రజల విద్య కోసం విశేష సేవ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదల్ జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్,మమ్మద్ అజాజ్, ఈసా ఉష, భాస్కర్ పాల్గొన్నారు.