- ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : విద్యా వ్యవస్థకు గుర్తింపు తీసుకు వచ్చింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో డాక్టర్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… ఈయన 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారు. విద్యాధికునిగా, కాకుండా రాజకీయంగా కూడా రాణినిచిన వ్యక్తి అజాద్ అని అన్నారు. ఈయన జయంతినీ మైనార్టీ సంక్షేమ దినంగా, జాతీయ విద్యా దినోత్సవంగా జరుపు కోవడం జరుగుతోందని అన్నారు. భారత దేశ విద్యావిధానం పటిష్టవంతం కావడానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి అమోఘం అని కొనియాడారు. స్వాతంత్ర్యానికి పూర్వం విద్యావేత్తగా, రాజకీయంగా రాణించిన ఆయన మేధో సంపత్తిని గుర్తించి, స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి జాతీయ విద్యాశాఖ మంత్రి గా పనిచేసిన ఘనత అబుల్ కలాం ఆజాద్ దే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.కళాశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండటానికి గల కారణాన్ని ప్రిన్సిపాల్ షరీఫ్ ను అడిగి తెలుసుకున్నారు. 2018 నుంచి కొనసాగుతున్న మెస్ చార్జీలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 50 రూపాయాలనుంచి 70 పెంచిందని అన్నారు. గురుకులానికి స్వంత భవన్ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకు వచ్చి నూతన భవన నిర్మానానికి కృషి చేస్తానని అన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సకల సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం కొని మైనారిటీ గురుకులానికి, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. ఆతర్వాత ప్రిన్సిపాల్, అధ్యాపకులు జీవిత చరిత్ర, విద్యావ్యవస్థలో తీసుకు వచ్చిన మార్పులను వివరించారు. ఆతర్వాత అతిథులను శాలువా కప్పి సత్కరించారు. మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి అతిథులచే బహుమతులను ప్రదనందేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు , కాంగ్రెస్ నాయకులు ఎన్.శ్రీనివాస్, తిరుపతి, పోచయ్య, ప్రిన్సిపాల్ షరీఫ్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.