— తెయూ వైస్- ఛాన్స్ లర్ ఆచార్య టి.యాదగిరిరావు
తేయూలో జాతీయ మాథ్స్ డే – వేడుకలు 2024
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శాస్త్ర సాంకేతికతకు గణితమే మూలాధారం అని తెయూ వైస్- ఛాన్స్ లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని ఇంపాక్ట్ అఫ్ మ్యాథమెటిక్స్ ఆన్ ఆల్ఫా జనరేషన్ అనే అంశంపై సోమవారం సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త రామానుజాచార్యుల ఆవిష్కరణలు ఈ ప్రపంచానికి అద్భుత ప్రగతిని అందించాయన్నారు. గణితశాస్త్రం నూతన ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తూ సమాజంలో అన్ని శాస్త్రాలను ప్రభావితం చేస్తుందన్నారు. గణిత శాస్త్ర భావనలు ప్రధానంగా శాస్త్ర సాంకేతిక, ప్రసార రంగాన్ని బలోపేతం చేసి సమాజ పురోభివృద్ధికి దారి చూపాయన్నారు. సెమినార్లో కీలక ఉపన్యాసకులుగా కాకతీయ యూనివర్సిటీ రిజిస్టార్ ఆచార్య మల్లారెడ్డి హాజరై ఆల్ఫా జనరేషన్లో గణిత శాస్త్రం అనువర్తనీయం గురించి, ట్రాఫిక్ వెయిటింగ్ టైం ను తగ్గించే క్యూయింగ్ థియరీని, సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ల లో గణితశాస్త్రం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ సెమినార్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొని పలు రకాల పోటీలను నిర్వహించినారు.పోస్టర్ ప్రజెంటేషన్లో ,క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అతిధులు బహుమతులు అందించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ, మ్యాథమెటిక్స్ హెడ్ డిపార్ట్మెంట్, సైన్స్ డీన్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి, టీజీ కాస్ట్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్- డా. వాసం చంద్రశేఖర్, గణిత శాస్త్ర విభాగం ఆచార్యులు డాక్టర్ బి శ్రీనివాస్ , పద్మ, చంద్రశేఖర్, వివిధ అప్లియేటెడ్ కళాశాల మ్యాథమెటిక్స్ ఆచార్యులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
