- 91 మంది సిబ్బందికి స్థానాచలనం
- కొత్తగా ఏర్పడిన పిఎస్ ల సిబ్బందికి మూకుమ్మడి బదిలీ
- అవినీతి ప్రక్షాళన కొరకే బదిలీ
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలు భారీగా సిబ్బందిని బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన కోసం మూకుమ్మడిగా ఒకే రోజు 91 మంది సిబ్బందిని పరిపాలన సౌలభ్యం పేరిట స్థానచలం కలిగించారు. ప్రధానంగా దశాబ్ద కాలంలో ఏర్పడిన కొత్త పోలీస్ స్టేషన్ లలో అవి స్థాపించినప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి స్థానాచల్నం కలిగించారు. జిల్లాలోని 73 మంది కానిస్టేబుళ్లు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 6 గురు ఏఎస్ఐలకు బదిలీ చేస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. టాస్క్ ఫోర్సులో లాంగ్ స్టాండింగ్ గా పనిచేస్తున్న వారికి స్థానిక కలిగించారు. ప్రధానంగా కోర్టు విధులు నిర్వహిస్తున్న వారికి కూడా బదిలీ చేశారు. కొత్త పోలీస్ స్టేషన్లో ఏర్పాటు కాగా అక్కడ ఆరు సంవత్సరాల పైబడి పనిచేస్తున్న వారికి బదిలీల్లో చోటు కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కల్మేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారీగా బదిలీలు జరగడం తొలిసారి.