Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2024, 8:23 pm Posted by : ramakrishna

 రోటరి నగర్ లో భారీ చోరి

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం

నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పరిధిలో రోటరి న గర్ లో భారీ చోరి జరిగింది. గంటల వ్యవధిలోని దొంగలు ఇంటిని దోచేశారు. శనివారం రాత్రి జరిగిన ఘటన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. 4వ టౌన్ ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రోటరి నగర్ కు చెందిన కొమురయ్య అనే వ్యక్తి సాయంత్రం ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి పడకగదిలోని బీరువాను ధ్వంసం చేసి అందులోని నాలుగున్నర తులాల బంగారం, రూ.25 వేల నగదు, వెండిని ఎత్తుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు  నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Massive theft in Rotary Nagar