Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2024, 8:47 pm Posted by : ramakrishna

న్యూ ఎన్జీవో కాలనీలో భారీ చోరీ

👉 23 తులాల బంగారం చోరీ

👉 ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి, సీఐ

👉 డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా కేసు దర్యాప్తు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీ భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సముద్రాల ఏల్లేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు కలిసి దీపావళి పండుగ సందర్భంగా గత నెల 28 న వారి సొంత ఊరు అయినా ఖమ్మం జిల్లా కి వెళ్లి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి వచ్చారు.సాయంత్రం అందజా ఐదు గంటలకి నిజామాబాద్ లో ని వాళ్ళ ఇంటికి వచ్చి చూడగా , ఇల్లు తాళం పగలగొట్టి ఉండి బీరువాలో నుండి ఎనిమిది తులాల వెండి, దాదాపుగా 23 తులాల బంగారు ఆభరణాలు ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగలించుకుని పోయినారు అని ఎల్లెశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Massive theft in New NGO Colony

ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ ఎస్ హెచ్ ఓ యు మహేష్ కేసు నమోదు చేయాగా టౌన్ సర్కిల్ సిఐ దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. ఘటన స్థలంలో ఆనవాళ్ళ కోసం క్లూస్ టీమ్ రప్పించి డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలన జరిపారు.

Massive theft in New NGO Colony