కల్వకుర్తి, బతుకమ్మ : నాగర్ కర్నూలు జిల్లాలో భారీ చోరీ జరిగింది. కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్లో నివాసముండే పూజారి శ్రీనివాస్ శర్మ ఇంట్లో బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లారు. నవంబర్ 30న కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ శర్మ ఊరికి వెళ్లి సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చే సరికి వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉన్న సుమారు 45 తులాల బంగారు నగలు, రూ.ఆరు లక్షల నగదు చోరీ కి గురైనట్లు శ్రీనివాస్ శర్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.