హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంటిలో చొరబడిన దుండుగులు రూ. 40 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి దోపిడీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.