నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషేన్ పరిధిలోని ఏకశీలనగర్ లో భారీ చోరి జరిగిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏకశీలనగర్ లో నావసం ఉండే తమ్మ ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి కర్ణాటక వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ప్రసాద్ ఇంటి గోడను దూకి వచ్చి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం పొరుగింటి వారు దొంగతనం గురించి ప్రసాద్ కు సమాచారం అందించారు. కర్ణాటకలో ఉన్న ప్రసాద్ ఈ విషయాన్ని బంధువులకు తెలియజేయడంతో వారు వచ్చి చోరి విషయాన్ని నిర్ధారించారు. బుధవారం ప్రసాద్ ఈ మేరకు తన ఇంట్లో చోరి విషయాన్ని గురించి లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో బీరువాలో 23 గ్రాముల బంగారం, 13 తులాల వెండి, లక్షా 20 వేల నగదు చోరికి గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు.