Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2024, 2:32 pm Posted by : ramakrishna

అన్నపూర్ణ సూపర్ మార్కెట్లో భారీ చోరీ

. . . 15 లక్షల నగధు ఎత్తుకేళ్లిన అగంతకులు

బతుకమ్మ, బోధన్ :

బోధన్ పట్టణం ఆచన్ పల్లి ప్రాంతంలో గల అన్నపూర్ణ సూపర్ మార్కెట్లో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సూపర్ మార్కెట్ రేకులు తొలగించి సూపర్ మార్కెట్ ను లూటీ చేశారు. సోమవారం ఉదయం షాపు తెరిచి చూడగా పైకప్పు రేకులను తోలిగించి ఆగంతకులు లోపలికి వచ్చి చోరి చేసినట్లు గుర్తించారు. సూపర్ మార్కేట్ లోనిి కౌంటర్ లో సుమారు రూ 15 లక్షల వరకు దొంగతనం జరిగినట్లు యజమాని సుదీర్ వెల్లడించారు. ఘటన స్థలాన్ని బోధన్ ఎసిపి శ్రీనివాస్, పట్టణ సీఐ వీరయ్య  స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. క్లూస్ టీంను రప్పించారు. వేలి ముద్రలు, ఆనవాళ్లు సేకరించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Massive theft in Annapurna supermarket