Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:04 pm Posted by : ramakrishna

ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

 

. . . విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయాలను పూర్తిగా విడుదల చేయాలని కోరుతూ 5000 ల మంది విద్యార్థులతో నిరసన,భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి  పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ వారి సర్టిఫికెట్స్ కళాశాలలోనే ఉండిపోవడంతో ఉన్నత విద్యకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరనను రూపొందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ నీల బాలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయలను విడుదల చేయకుండా,ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వాటినే విడుదల చేసి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందన్నారు. కమిషన్లు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుబకాయలు ఇవ్వడం జరిగిందని, పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కళాశాలలకు ఫీజుబకాయలు విడుదల కావడం జరిగితే కామారెడ్డికి ఎందుకు విడుదల చేయలేదు అని ప్రశ్నించారు.33 జిల్లాలలో కొన్ని జిల్లాలలోని కళాశాలలకు విడుదల చేసి,మరికొన్ని జిల్లాల కళాశాలలకు ఫీజు బకాయలు విడుదల చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.గతంలో ఫీజుబకాయలు చెల్లించాలని పోరాట బాట పట్టిన రేవంత్ రెడ్డి మరి ప్రస్తుతం విద్యార్థుల ఫీజు బకాయలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయకపోతే వేలాదిమంది విద్యార్థులతో ప్రజా భవన్ ముట్టడిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చౌట గణేష్, సవీందర్ నాయక్,మోతే రాజిరెడ్డి,కొత్త వినయ్ యూసుఫ్,మన్నన్,రవి కుమార్,అంజల్ రెడ్డి లు పాల్గొన్నారు.