Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 1:36 pm Posted by : ramakrishna

ఈరోజు నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు

హైదరాబాద్, బతుకమ్మ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఖాళీలపై ఉన్నతాధికారులతో చర్చించి..ఖాళీలను బట్టి వేగవంతంగా నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపడతామని మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం నుంచి ఎస్సీవర్గీకరణ అమలులోకి వస్తోందని మంత్రి దామోద రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని స్పష్టం చేశారు. ఈరోజు నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.