Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:42 pm Posted by : ramakrishna

కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

 

. . . 457.45 మీటర్లకు చేరిన నీటిమట్టం

 

జుక్కల్, బతుకమ్మ :

 

కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 140 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివకుమార్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 458.00 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 457.45 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోందని ఏఈ పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని గమనిస్తున్నారు. ప్రస్తుత నీటి ప్రవాహం నేపథ్యంలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.