Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 2:54 pm Posted by : ramakrishna

భారీ వరద.. భారీ నష్టం..

  • రెండు పౌల్ట్రీ పామ్ లోకి భారీ వరద నీరు
  • నిర్వాహకుడికి 4 లక్షల వరకు నష్టం

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందాల్వాయి గ్రామానికి చెందిన తోట చిన్న రాజన్న అనే వ్యక్తి కోళ్ల ఫారం నందు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు రెండు కోళ్ల ఫారలలోకి రావడంతో అందులో ఉన్న సుమారు పదివేల కోళ్ల వరకు మరణించాయని బాధితుడు తోట చిన్న రాజన్న తెలిపారు. జీవనాధారం కొరకు పౌల్ట్రీఫారాలు పెట్టుకుంటే  భారీ వరద రూపంలో ఇలా నష్టం జరుగుతుందని ఊహించలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. సుగుణ కోళ్ల కంపెనీకి చెందిన వారికి  భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు.అలాగే కోళ్ల పెంపకం నిర్వహకులు  తోట చిన్న రాజన్నకు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు.

Massive flood.. massive damage..