ఎస్సారెస్పీ లోకి భారీ వరద
క్రమంగా పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం చిగురిస్తున్న ఆయకట్టు రైతుల ఆశలు మెండోరా, బతుకమ్మ : గత రెండు రోజులు కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు 50503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి ఏఈ రవి తెలిపారు. ఆదివారం మధ్యరాత్రి 12 గంటలకు 10,500 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రారంభమై మూడు గంటలకు 22,436 క్యూసెక్కులుగాను ఉదయం 6 గంటలకు 29933 క్యూసెక్కులకు...