Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 5:00 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ లోకి భారీ వరద

  • క్రమంగా పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం
  • చిగురిస్తున్న ఆయకట్టు రైతుల ఆశలు

 

మెండోరా, బతుకమ్మ : గత రెండు రోజులు కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు 50503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి ఏఈ రవి తెలిపారు. ఆదివారం మధ్యరాత్రి 12 గంటలకు 10,500 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రారంభమై మూడు గంటలకు 22,436 క్యూసెక్కులుగాను ఉదయం 6 గంటలకు 29933 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్ట్ లోకి 50వేల 53 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులకు గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వస్తుందని తెలియడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టిఎంసిలు కాగా ఆదివారం రోజు 1070.30 అడుగులు 23.866 టీఎంసీల నీరు నిల్వ ఉంది.